ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో ఒకటి 'దసరా'. రీసెంట్గా విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి హార్ట్ బ్రేక్ యాంథెం సాంగ్ విడుదల కాబోతుంది. ఈ మేరకు సాయంత్రం 05:04 నిమిషాలకు ఓరి వారి హార్ట్ బ్రేకింగ్ మెలోడీ విడుదల కాబోతున్నట్టు కాసేపటి క్రితమే స్పెషల్ పోస్టర్ విడుదల అయ్యింది.