మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, కోలీవుడ్ మూవీ మావెరిక్ శంకర్ రూపొందిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "RC 15". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గత వారంలో వివాహజీవితంలోకి అడుగుపెట్టింది. ప్రేమికుడు , బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈనెల 7వ తేదీన ఏడడుగులు నడిచిన కియారకు RC 15 చిత్రబృందం వెడ్డింగ్ విషెస్ తెలియచేస్తూ, కాసేపటి క్రితమే స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఇందులో చరణ్, శంకర్లతో పాటుగా దిల్ రాజు, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, ప్రియదర్శి, సత్య తదితర చిత్రబృందం అంతా ఉన్నారు.