థియేటర్లలో ప్రభంజన విజయం సాధించిన, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన "వీరసింహారెడ్డి" మూవీ ఈ నెల 23 సాయంత్రం ఆరు గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే వీరసింహారెడ్డి ఓటిటి వెర్షన్ న్యూ ట్రైలర్ ను హాట్ స్టార్ విడుదల చేసింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ లో నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.