శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". శశిధర్ చావలి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 24 వతేదీన Mr. కింగ్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ విడుదల చేసి మేకర్స్ తెలియచేయడం జరిగింది.
హాన్విక క్రియేషన్స్ బ్యానర్ పై బొల్లిబోయిన నాగేశ్వరరావు (BN రావు) నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యశ్విక నిష్కల హీరోయిన్ గా నటిస్తుంది.