ఎప్పటికప్పుడు కొత్త కధలను ఎంచుకుంటూ, ప్రేక్షకులను అలరించడంలో తనదైన విభిన్నతను చాటుకుంటారు ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. గతేడాది "అల్లూరి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి రివ్యూలు వచ్చాయి.
ఈ ఏడాది ఒక న్యూ అండ్ ఎక్జయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11:07 నిమిషాలకు రివీల్ కాబోతుందని కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.
'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు కాగా కోలీవుడ్ నటి రెబా మోనికా జాన్ శ్రీవిష్ణు సరసన నాయికగా నటిస్తుంది.