వరస పరాయజయల తదుపరి "టెంపర్" తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తారక్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన టెంపర్ విడుదలై ఈ రోజుతో 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఫిబ్రవరి 13, 2015లో ధియేటర్లకొచ్చిన ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కి ఆడియన్స్ నుండి మాత్రమే కాక క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద టెంపర్ బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. తదుపరి ఈ చిత్రం హిందీలో సింబ, తమిళంలో అయోగ్యగా రీమేక్ అయ్యింది.
ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి, మధురిమ, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కోవై సరళ, రమాప్రభ తదితరులు నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు.