వాలెంటైన్స్ డే సందర్భంగా దసరా మూవీ నుండి హార్ట్ బ్రేకింగ్ మెలోడియస్ 'ఓరి వారి' లిరికల్ వీడియో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 05:04 నిమిషాలకు ఈ పాట పూర్తి వీడియో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటల నుండి AMB సినిమాస్ స్క్రీన్ -1 లో దసరా సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.