మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ కోసం స్ట్రాంగ్ విలన్ ను త్రివిక్రమ్ సెట్ చేసినట్లు సమాచారం. మహేష్ కు ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే జరిగితే ముచ్చటగా మూడోసారి ఈ ముగ్గురు కలిసి పని చేసే అవకాశం ఉంది. గతంలో మహేష్ తో జగపతిబాబు శ్రీమంతుడు, మహర్షి వంటి సినిమాలు చేశారు.