కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "జవాన్". లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించాలని రిక్వెస్ట్ చేస్తూ డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఈమధ్యనే కలిసారట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో తలపతి విజయ్ క్యామియో ఉంటుందని ప్రచారం జరగ్గా, తాజాగా ఇప్పుడు బన్నీ పేరు వినిపించడం విశేషం. బాలీవుడ్ బాద్షా కి పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ కలిస్తే ధియేటర్ గోడలు బద్దలవ్వాసిందే. అలానే బాక్సాఫీస్ రికార్డులు కూడా. ఐతే, అట్లీ మనవి పై బన్నీ తన నిర్ణయాన్ని ఇంకా తెలుపలేదు. త్వరలోనే బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ రావొచ్చు కాబట్టి.. అతి త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ కూడా రాబోతుంది.