టాలీవుడ్ హీరో, విలక్షణ నటుడు జగపతిబాబు తన కెరీర్ లో గుర్తుండిపోయిన ఓ సంఘటనను మీడియాతో పంచుకున్నాడు. తాను ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్ల అవుతోందని, నాకు సినిమా తప్ప మిగతా ఏం తెలియదని చెప్పాడు. 'సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్ లో వారంపాటు తిండిపెట్టలేదు. కనీసం తింటారా? అని కూడా అడగలేదు. ఈ అవమానం నాకు మంచి గుణపాఠం నేర్పించింది. ఇక్కడే ఉంటాడులే, ఎలాగో సినిమా చేస్తాడులే అని నన్ను చులకనగా చూసేవారు.' అని చెప్పాడు.