రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ ట్రేడర్స్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన రెండు రోజులలో $130,861 వసూలు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.