దిగ్గజ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుండి మరొక దృశ్యకావ్యం రాబోతుంది. ఐతే, ఈ సారి ఈ అద్భుతం వెండితెరపై కాదు.. డిజిటల్ రంగంలో. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందుతున్న "హీరామండి" కి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గంగూభాయ్ కతియవాది బ్లాక్ బస్టర్ తదుపరి భన్సాలీ నుండి రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఉంది ఈ రోజు మధ్యాహ్నం విడుదలైన ఫస్ట్ లుక్. హీరామండి ప్రపంచానికి ఆహ్వానం పలుకుతున్న సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సైగల్, సంజీదా షేక్ లను చూస్తూ కళ్లప్పజెప్తున్నారు ఆడియన్స్. మరైతే, త్వరలోనే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa