నిన్న ప్రీలుక్ పోస్టర్ ను విడుదల చేసి గోపీచంద్ అభిమానులను ఖుషి చేసిన 'రామబాణం' మేకర్స్ మహాశివరాత్రి సందర్భంగా కాసేపటి క్రితమే గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు . ఇందులో ఫెరోషియస్ లుక్ లో గోపీచంద్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన విక్కీ అనే పాత్రలో నటిస్తున్నారు. అతి త్వరలోనే మరొక అప్డేట్ రాబోతుందని మేకర్స్ తెలిపారు.
గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa