వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద $100K మార్క్ ని క్రాస్ చేసింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్‌లో వాతి/సర్ కలెక్షన్స్ ని షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa