దర్శకుడు శ్రీవాస్ మ్యాచో స్టార్ గోపీచంద్ కలయికలో రాబోతున్న మూడవ సినిమా "రామబాణం". లక్ష్యం , లౌక్యం వంటి సూపర్ హిట్స్ తదుపరి ఈ కలయికలో రాబోతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటికి రాలేదు.
తాజాగా మహాశివరాత్రి సందర్భంగా రామబాణం ప్రచార కార్యక్రమాలను మొదలెట్టింది. ఈ మేరకు విడుదలైన గోపీచంద్ ఫస్ట్ లుక్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వేసవికి రామబాణం విడుదల కాబోతుందని చిత్రబృందం అధికారికంగా తెలపడం జరిగింది. మరి, అతి త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa