యంగ్ హీరో కిరణ్ అబ్బవరం న్యూ మూవీ "వినరో భాగ్యము విష్ణుకథ". నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తదుపరి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఈ సినిమా 2.75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. యంగ్ హీరో కిరణ్ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావడమే కాక కెరీర్ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లను అందుకున్నారు.
మురళి కిషోర్ దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించగా, మురళీ శర్మ కీరోల్ లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa