ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పఠాన్' మేకర్స్ నుండి మరో వినూత్న ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 07:38 PM

బాద్షా షారుక్ ఖాన్ నాలుగేళ్ళ తదుపరి పఠాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, వారికి పూనకాలని తెప్పిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ సినిమా కలెక్షన్లు తాజాగా 500NBOC కి చేరుకున్నాయి. దీంతో ఈ మార్క్ అందుకున్న తొలి హిందీ చిత్రంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ నెవర్ బిఫోర్ రికార్డును నమోదు చేసింది.


భారతదేశం మొత్తమ్మీద ఉన్న PVR, INOX, సినీపోలిస్ లలో గత శుక్రవారం పఠాన్ షో టికెట్ రేట్లను 110/- ఫ్లాట్ చేసి, వినూత్న ప్రకటన చేసిన మేకర్స్ తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ ఎనౌన్స్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేంటంటే, వీక్ డేస్ లో అంటే సోమవారం నుండి గురువారం వరకు పఠాన్ టికెట్ రేట్లను ఫ్లాట్ 110/- గా ఫిక్స్ చేస్తూ కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa