మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర" నుండి నిన్న సెకండ్ సింగిల్ 'ప్యార్లోన పాగల్' లిరికల్ వీడియో విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. యూట్యూబ్లో 2 మిలియన్ వ్యూస్ తోటి ఈ పాట ట్రెండ్ అవుతుంది. రవితేజ మార్క్ ఎనర్జిటిక్ బ్రేకప్ సాంగ్ గా, మాంఛి పార్టీ నెంబర్ గా శ్రోతలను ఆకట్టుకుంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటకు రవితేజ మెస్మరైజింగ్ మూవ్మెంట్స్ వేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటను మాస్ రాజా రవితేజ స్వయంగా ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa