శుక్రవారం విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తదుపరి బలమైన పాజిటివ్ టాక్ తో ఇరు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ థియేటర్లలతో రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా తొలి రోజు 2.75 గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా చాలా మంచి బుకింగ్స్ కనబరుస్తుంది. విశేషమేంటంటే, శుక్రవారం కన్నా రెండో రోజైన శనివారం రోజు బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa