మెగా హీరోయిన్ నిహారిక ప్రస్తుతం నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో సూర్యకాంతం అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ నిహారిక కు జోడీగా నటిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం 5గం.లకి టీజర్‌ని విడుదల చేసి మూవీపై మరింత హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు. మరో వైపు నిహారిక నూతన దర్శకురాలు సుజనా తెరకెక్కించనున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోను నటిస్తుంది. ఇందులో శ్రియాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa