ఐదు సార్లు జాతీయ అవార్డులు పొందిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ విలక్షణ నటుడు ధనుష్ కలయికలో వచ్చిన మూడవ సినిమా "వడ చెన్నై". 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ సాధించింది. ప్రారంభంలోనే ట్రయాలజిగా రూపొందిన ఈ సినిమా యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, తాజాగా ధనుష్ స్వయంగా స్పందించారు. వడ చెన్నై 2 స్క్రిప్ట్ పూర్తవ్వడమే ఆలస్యం.. సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్ ని మెటీరియలైజ్ చేసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సెట్స్ పైకి ఈ సినిమా ఎప్పుడు వెళ్తుందో చెప్పలేను కానీ.. ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది... అని సెలవిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa