సూపర్ స్టార్ మాహేశ్ బాబు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో 11ఏళ్ల తర్వాత సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఈ సినిమాలో బాలీవుడ్ బామ భూమి పడ్నేకర్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నారు. సెకండ్ హాఫ్ లో లేడీ కానిస్టేబుల్ పాత్రలో ఈమె కనిపించబోతోందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa