బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "భోళా". కోలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఖైదీ" కి అఫీషియల్ హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు అజయ్ దేవగణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
కాసేపటి క్రితమే భోళా చిత్రబృందం సినిమా నుండి రొమాంటిక్ సింగిల్ 'నజర్ లగ్ జాయేగి' ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. రవి బసృర్ స్వరపరిచిన ఈ గీతాన్ని జావేద్ అలీ ఆలపించారు. ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించారు.
స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలో నటిస్తుంది. అజయ్ దేవగణ్ ఫిలిమ్స్, డ్రీం వారియర్ పిక్చర్స్, టి సిరీస్ , రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 30, 2023లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa