బెల్లంకొండ గణేష్, బాలీవుడ్ బ్యూటీ అవంతికా దస్సాని జంటగా నటిస్తున్న చిత్రం "నేను స్టూడెంట్ సర్". రాఖి ఉప్పలపాటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి ముస్తాబవుతోంది.
గతంలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'మాయే మాయే' లిరికల్ వీడియో విడుదలై, శ్రోతలను మెప్పించగా, తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ '24*7 ఒకటే ధ్యాస' లిరికల్ వీడియోను విడుదల చెయ్యటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు ఈ పాట యొక్క ప్రోమోను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.