కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుండి వచ్చిన కొత్త చిత్రం "వాతి". తెలుగులో "సార్". వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
శుక్రవారం విడుదలైన వాతి/ సార్ వీకెండ్స్ లో బాగా కలెక్ట్ చేసింది. ఇక, కీలకమైన సోమవారం పరీక్షను సార్ డిస్టింక్షన్లో పాసయ్యాడు. తాజాగా సార్ / వాతి వరల్డ్ వైడ్ కలెక్షన్లు 51 కోట్ల మార్క్ ని చేరుకొని ధనుష్ కెరీర్ లో బెస్ట్ వీకెండ్ ఓపెనర్ గా నిలిచింది.