టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని దర్శకుడు విజయ్ కనకమేడలతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'ఉగ్రం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినీప్రేమికులలో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
గతంలో ఈ సినిమా ఏప్రిల్ 14, 2023న థియేటర్లలో విడుదలవుతుందని మూవీ టీమ్ ప్రకటించింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో కి రానుంది అని సమాచారం. ఈ విషయం గురించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.