ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "నో ఎంట్రీ". R. అళగు కార్తీక్ దర్శకత్వంలో విభిన్న కధాంశంతో రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ కాసేపటి క్రితమే విడుదలయ్యింది. ఇండియాకి పాకిస్థాన్ కి మధ్య ఉండే సరిహద్దు రేఖ ప్రాంతంలో ఉండే కుక్కల నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠకరంగా సాగింది.
అజేష్ సంగీతం అందించిన ఈ సినిమాను జంబో సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ అరుణాచలం నిర్మించారు.