కీలకపాత్రలను పరిచయం చేస్తూ వస్తున్న గేమ్ ఆన్ మేకర్స్ తాజాగా కాసేపటి క్రితం సినిమాకు కేంద్ర బిందువైన హీరో గీత్ ఆనంద్ క్యారెక్టర్ పోస్టర్ను రివీల్ చేసారు. ఇందులో 'సిద్ధూ' అనే పాత్రలో గీత్ ఆనంద్ నటిస్తున్నారు.
నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మధుబాల కీరోల్ లో నటిస్తున్నారు. దయానంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. రేపు ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది.