శాండల్ వుడ్ సెన్సేషన్ "కాంతార" పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించారు.
కాంతారా సినిమాకు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి వచ్చిన విశేష స్పందన కారణంగా సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంతారా సీక్వెల్ పై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిలో ఆసక్తిరమైన వార్త ఒకటి ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, కాంతారా 2 లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వైరల్ గా మారింది. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే, అఫీషియల్ క్లారిటీ రావలసిందే.