యువనటుడు కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల విశేష మన్ననలను అందుకుంటుంది. రెండ్రోజుల్లో 5 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే చిత్రబృందం అద్భుతమైన ప్రకటన చేసింది. బుధ, గురు వారాలలో VBVK టికెట్లు ఒకటి కొంటే మరొకటి ఉచితం.. అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.