ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా 'లవ్ టుడే'. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ స్టూడియోస్ ఇటీవల AGS ఎంటర్‌టైన్‌మెంట్ నుండి హక్కులను పొందింది. హిందీ భాషా వెర్షన్‌కి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. హిందీ రీమేక్ 2024 ప్రారంభంలో థియేటర్లలో విడుదల కానుంది.