యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా నిర్మాతలు సినీ ప్రేక్షకులకు ఓ మంచి ఆఫర్ ప్రకటించారు. ఒకే టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్టు గీతా ఆర్ట్స్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోని సింగల్ స్క్రీన్ థియేటర్లలో ఈ బుధవారం, గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
![]() |
![]() |