సౌత్ ఇండస్ట్రీ క్వీన్ త్రిష ముఖ్యపాత్రలో నటించిన చిత్రం "రాంగి". ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించారు. M శరవణన్ దర్శకత్వం వహించారు. C సత్య సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అతి తక్కువకాలంలోనే డిజిటల్ రంగంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు అక్కడ కూడా చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3 గంటలకు సన్ టీవీ లో రాంగి మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. పోతే, తెలుగులో 'రిపోర్టర్' గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది ఈ సినిమా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa