మాస్ రాజా రవితేజ సొంత నిర్మాణసంస్థ RT టీం వర్క్స్ నిర్మాణ సారధ్యంలో నాల్గవ చిత్రంగా "ఛాంగురే బంగారు రాజా" రూపొందుతుంది. సతీష్ వర్మ డైరెక్షన్లో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ తో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు, ఛాంగురే బంగారు రాజా చిత్రీకరణ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్స్ విడుదల చేసారు. మరి, అతి త్వరలోనే ఎక్జయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నామని చిత్రబృందం తెలిపింది.