యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. నితిన్ కెరీర్ లో 32వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త పోస్టర్ విడుదలయ్యింది. ఈ రోజు డైరెక్టర్ వక్కంతం వంశీ పుట్టినరోజు కావడంతో, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మేకర్స్ స్పెషల్ బర్త్ డే పోస్టర్ విడుదల చేసారు.