డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి చేతుల మీదుగా 'రిచిగాడి పెళ్లి' ట్రైలర్ విడుదలయ్యింది. సత్య SK ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను KS హేమరాజ్ డైరెక్ట్ చేసారు. సత్యన్ సంగీతం అందిస్తున్నారు. KS ఫిలిం వర్క్స్ బ్యానర్ పై KS హేమరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఇక, ట్రైలర్ విషయానికొస్తే, హీరో పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ ఒకచోట కలుసుకుని, సరదాగా గడుపుతుంటారు. ఒకరోజు రాత్రి ఒక వినూత్నమైన గేమ్ ను ఆడతారు. తమకు ఎలాంటి కాల్స్ వచ్చినా స్పీకర్ లో పెట్టి మాట్లాడాలనేది.. గేమ్ రూల్. ఇంకేముంది.. ఒక్కొక్కరి భాగోతం బయట పడుతూ ఉంటుంది. ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.