టాలీవుడ్ లో పేరెన్నికగన్న రచయితల లిస్ట్ లో వక్కంతం వంశీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
కిక్, ఎవడు, రేస్ గుర్రం, టెంపర్, ఊసరవెల్లి, కిక్ 2, అశోక్, అతిథి, కలుసుకోవాలని వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలను వంశీ అందించారు. కొన్ని చిత్రాలకు డైలాగ్స్ కూడా రాసారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన డైరెక్షన్లో రెండవ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న హీరో నితిన్ 32 వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.