సమ్మర్ వచ్చేస్తోంది. వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చెయ్యాలనుకునే వారి కోసం ఈ క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..! టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘దాస్ కా దమ్కీ’ మార్చిలో విడుదల కానుంది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లూ-2, నాచురల్ స్టార్ నాని మూవీ దసరా, ‘ఏజెంట్’గా అక్కినేని అఖిల్, నిఖిల్ హీరోగా స్పై, సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న విరూపాక్ష సినిమాలు సమ్మర్‌లో సందడి చేయనున్నాయి.