కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న 21వ సినిమా "రంగమార్తాండ". ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కి ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుండగా తాజాగా మేకర్స్ మూడవ లిరికల్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు ఫిబ్రవరి 22న అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ సినిమా నుండి పువ్వై విరిసే ప్రాణం .. లిరికల్ వీడియో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |