టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా ‘భం భం భోలే’ అనే పాటను రిలీజ్ చేసింది. కాగా ఈ పాటను శ్రీకాళహస్తి శివుని ఆలయంలో షూట్ చేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. శ్రీకాళహస్తి టెంపుల్‌లో వీడియో తీయడానికి అనుమతి లేదు. అలాంటిది కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ అండ్ టీం 10 రోజులు క్రితమే ఈ పాటని చిత్రీకరించారు.