వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన "సార్/వాతి" సినిమాకు తెలుగు, తమిళ భాషా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఇరు భాషల బాక్సాఫీస్ ల వద్ద భీకర కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా యొక్క ఘనవిజయంపై మాట్లాడుతూ... ప్రేక్షకులందరికీ డైరెక్టర్ వెంకీ అట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ కి ఇంత హ్యుజ్ ఇంపాక్ట్ ఉంటుందని ఊహించలేదని చెప్పారు. అలానే ధనుష్ ఫ్యాన్స్ కి ఈ రోజు ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ ఉందని ఎనౌన్స్ చేసారు.