ముత్తు M దర్శకత్వంలో సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, రజీమ్ హీరోలుగా, నయన్ కరిష్మా, అమృత హల్దార్, మంజీరా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "చిక్లెట్స్". SSB ఫిలిమ్స్ పతాకంపై శాంతి శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోవై A మణికందన్ సహ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. A శ్రీనివాసన్ గురు సమర్పిస్తున్నారు. బాలమురళి బాలు సంగీతం అందిస్తున్నారు.
తాజాగా చిక్లెట్స్ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ రోజుల్లో 2కే కిడ్స్ వ్యవహారశైలి ఎలా ఉంటుంది? తల్లి తండ్రులకు హీరోహీరోయిన్లు చెప్పకుండా చేసిన పనులు వారి భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేసాయి? అనే నేపథ్యంలో ఔటండౌట్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa