మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం USA లో ఉన్నారు. ఈరోజు ఉదయం యూఎస్ ఫేమస్ టాక్ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా' కి చరణ్ హాజరయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఐతే, కొడుకు పొందిన ప్రెస్టీజియస్ హానర్ పై చిరు అప్రిసియేషన్ ట్వీట్ చేసారు. ప్రఖ్యాత గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రాంచరణ్ పాల్గొనడం తెలుగు/ ఇండియన్ సినిమాకు గర్వకారణం. రాజమౌళి మెదడు పుటల్లో మొలకెత్తిన ఒక ప్యాషనేట్ ఐడియా యొక్క పవర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది... అంటూ చిరు ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఐతే, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.