ఈ రోజు విడుదల కావలసిన "నేను స్టూడెంట్ సర్" సెకండ్ సింగిల్ '24/7 ఒకటే ధ్యాసా .. గుండెలోపలే ఉందొక ఆశ..' లిరికల్ వీడియో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడిందని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. విచిత్రమేంటంటే, ఫస్ట్ సింగిల్ 'మాయే మాయే' లిరికల్ వీడియో రిలీజ్ టైం లో కూడా సేమ్ ఇలానే జరిగింది. అంటే ప్రోమో విడుదల చేస్తారు. కానీ ఫుల్ సాంగ్ ని విడుదల చేసే రోజు వాయిదా పడిందని ఎనౌన్స్ చేస్తారు. మరి ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజినా.. లేక నిజంగానే సాంకేతిక సమస్యనా అని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.