కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినీరంగప్రవేశం చేసి నేటితో పదహారేళ్ళు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు కార్తీకి హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఏడాదికేడాదికి తనలోని విలక్షణతను చూపిస్తూ అలరిస్తున్న కార్తీ ఫ్యూచర్ లో మరిన్ని గ్రాండ్ సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటున్నారు.
కార్తీ నటించిన తొలి సినిమా 'పరుత్తివీరన్' 2007లో సరిగ్గా ఇదే రోజు విడుదలయ్యింది. తొలి సినిమాతోనే తన విలక్షణ నటనతో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందారు. దీంతో కార్తీకి వరస ఛాన్సులు క్యూ కట్టాయి. కార్తీ నటించిన తొలి ఐదు సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఊపిరితో తొలిసారి తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన కార్తీకి ఇక్కడ ఘనస్వాగతం లభించింది. అప్పటి నుండి కార్తీ నటించిన సినిమాలు అదేరోజు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.