"Mr. కింగ్" సినిమాతో శరణ్ కుమార్ టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నారు. శశిధర్ చావాలి డైరెక్షన్లో థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో యశ్విక నిష్కళ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్గానే మేకర్స్ ట్రైలర్ ను విడుదల చెయ్యగా,దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. మురళి శర్మ, తనికెళ్ళ భరణి, ఉర్వి సింగ్, వెన్నెల కిషోర్, సునీల్, SS కంచి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. BN రావు నిర్మిస్తున్నారు.
ఉన్నతలక్ష్యం, స్వచ్ఛమైన ప్రేమల మధ్య నలిగిపోయిన ఒక యువకుడి పోరాటమే ఈ సినిమా. ఈ పోరాటంలో తుదకు హీరో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? ప్రేమను గెలిపించుకున్నాడా..? అనేది తెలియాలంటే మాత్రం రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందే.