విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి సుబ్రహ్మణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. నడి వయసులో ఉన్న ఓ మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa