కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "జవాన్". లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై గత కొన్నిరోజులుగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ నడుస్తుంది. తాజాగా ఈ విషయంపై మరొక క్రేజీ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, దాదాపు పదినిమిషాల పాటు ఐకాన్ స్టార్ బాలీవుడ్ బాద్షా తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఈ విషయంతో బన్నీ అభిమానుల్లో ఫుల్ ఖుషి నెలకొంది. ఐతే, అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa