జీ 5లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లాస్ట్' వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ 'చోర్ నికల్ కే భాగా' అనే హిందీ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అజయ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మార్చి 24, 2023న నెట్ఫ్లిక్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని OTT దిగ్గజం తన అధికారిక సోషల్ మీడియా ప్రొఫైల్ లో ప్రకటించింది. విడుదల తేదీతో కూడిన సరికొత్త పోస్టర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
అమర్ కౌశిక్ మరియు షిరాజ్ అహ్మద్ రాసిన ఈ హీస్ట్ థ్రిల్లర్ లో సన్నీ కౌశల్, శరద్ కేల్కర్ మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌ని మాడాక్ ఫిల్మ్స్‌కి చెందిన దినేష్ విజన్ మరియు అమర్ కౌశిక్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa