కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా కసాండ్రా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నేనే నా' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తమిళ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన SP సినిమాస్ ఇప్పుడు ఈ కంటెంట్-ఆధారిత చిత్రం యొక్క థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న సినిమా 1920లు మరియు ప్రస్తుత కాలాల రెండు విభిన్న కాలాల్లో సెట్ చేయబడింది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, జయప్రకాష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa